Nellore: కరోనా విజృంభణ.. రేపటి నుంచి నెల్లూరు లాక్ డౌన్!

Nellore lockdown from tomorrow
  • ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • నెల్లూరు జిల్లాలో 3 వేలు దాటిన కేసుల సంఖ్య
  • రేపటి నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్
ఏపీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లాలో కూడా నిన్న 327 కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటి వరకు 3010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నెల్లూరులో లాక్ డౌన్ విధించబోతున్నారు. జూలై 24 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది. మెడికల్ షాపులు, పాల బూత్ లకు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఉంటుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో లాక్ డౌన్ అమలవుతోంది.
Nellore
Lockdown
Corona Virus

More Telugu News