Andhra Pradesh: తానిచ్చిన హామీని పూర్తిగా మరచిపోయిన జగన్: పురందేశ్వరి

Purandeshwari Tweet on Jagan to fulfil his Promise
  • ఇళ్ల నిర్మాణానికి ఖర్చు ప్రభుత్వానిదే
  • గతంలో జగన్ ఆ హామీ ఇచ్చారు
  • దాన్ని నిలుపుకోవాలని పురందేశ్వరి ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తానిచ్చిన హామీని మరచిపోయారని, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, పేదల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని సూచించారు. ఈ మేరకు తానిచ్చిన హామీని జగన్ నిలుపుకోవాలన్నారు.  "రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి విషయానికి వస్తే, 300చ.అ. ఇళ్ళ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా తమ ప్రభుత్వమే భరిస్తుందని ఇచ్చిన హామీని జగన్మోహన రెడ్డి పూర్తిగా మర్చిపోయారు‌" అని ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh
Daggubati Purandeswari
Jagan
Twitter

More Telugu News