Nithin: పెళ్లికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన నితిన్

Nithin invites Pawan Kalyan to his marriage
  • 26వ తేదీన షాలినితో నితిన్ పెళ్లి
  • ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య వివాహ వేడుక
  • ఇప్పటికే కేసీఆర్ ను ఆహ్వానించిన నితిన్
ఈనెల 26న హీరో నితిన్ పెళ్లి జరగబోతోంది. తన ప్రియురాలు షాలినిని నితిన్ పెళ్లాడబోతున్నాడు. హైదరాబాదులోని ఓ లగ్జరీ హోటల్ లో వీరి వివాహం జరగబోతోంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు లోబడి వివాహ వేడుకను నిర్వహించనున్నారు. వివాహానికి కేవలం ఇరు కుటుంబాలవారిని, సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.

ఇక తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నితిన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ ను కూడా నితిన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. పవన్ తో పాటు హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కూడా శుభలేఖలు అందాయట.
Nithin
Marriage
Pawan Kalyan
Tollywood

More Telugu News