Lanka Dinakar: చంద్రబాబు తొత్తు విజయసాయిరెడ్డి.. అసలు వేషం బయటకొచ్చింది: లంకా దినకర్

Vijayasai Reddy is Chandrababus candidate says Lanka Dinakar
  • విజయసాయిని టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలు
  • జగన్ పై పగబట్టాడన్న దినకర్
  • పిచ్చి సలహాలు ఇస్తూ చెడ్డ పేరు తెస్తున్నారని వ్యాఖ్య
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుకు కోవర్టు అంటూ వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా విజయసాయిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడల్లా... ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక వేషం వేస్తాడని ఎద్దేవా చేశారు. అందులోనూ ఈరోజు అమావాస్య అని... విజయసాయి అసలు వేషం బయటకొచ్చిందని అన్నారు. చంద్రబాబుకు అసలు తొత్తు ఈయనే అని... సీఎం జగన్ పై పగపట్టి, పిచ్చి సలహాలు ఇచ్చి ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాడని విమర్శించారు.
Lanka Dinakar
BJP
Vijayasai Reddy
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News