Raashi Khanna: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రాశీ ఖన్నా

Raashi Khanna participates in Green India Challenge
  • రాశీ ఖన్నాను నామినేట్ చేసిన రష్మిక మందన్న
  • మొక్కలు నాటాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన రాశీ
  • రకుల్, కాజల్, తమన్నాలను నామినేట్ చేసిన అందాలభామ
టాలీవుడ్ అందాల భామ రాశీ ఖన్నా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాలుపంచుకున్నారు. రష్మిక మందన్న విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన రాశీ మొక్కలు నాటారు. అంతేకాదు, మరో ముగ్గురు కథానాయికలను గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నాలకు చాలెంజ్ విసిరారు. అభిమానులు కూడా ఈ చాలెంజ్ లో భాగస్వాములు కావాలని, మొక్కలు నాటడం ద్వారా ఆదర్శంగా నిలవాలని రాశీ ఖన్నా పిలుపునిచ్చారు.

Raashi Khanna
Green India Challenge
Rashmika Mandanna
Rakul Preet Singh
Kajal Agarwal
Thamanna
Tollywood

More Telugu News