Pawan Kalyan: దిశ పేరుతో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏం చేస్తున్నాయి?: 'బాలికపై సామూహిక అత్యాచార' ఘటనపై పవన్ కల్యాణ్

pawan  asks  where is disha act
  • సామూహిక అత్యాచార ఘటన అమానుషం 
  • 4 రోజులు చిత్ర హింసలకు గురి చేశారు
  • ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలి
  • పోలీసులు సకాలంలో స్పందించలేదు
రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తోన్న 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచి వేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తోందని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

నాలుగు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాణ్‌ కోరారు. తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సకాలంలో స్పందించలేదని తెలిసిందని తెలిపారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషం అని పవన్ అన్నారు.        
               
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News