Vladimir Putin: పుతిన్‌కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టిన రష్యన్లు.. ఇక జీవితాంతం ఆయనే అధ్యక్షుడు!

Vladimir Putin will be the life long president of Russia
  • రెండు దశాబ్దాలుగా అధ్యక్ష పీఠంపై ఉన్న పుతిన్
  • రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 78 శాతం ఓట్లు
  • వేర్పాటువాద గ్రూపులను అణచివేసి ప్రజల మన్నన చూరగొన్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ ప్రజలు విశేష అధికారాలు కట్టబెట్టారు. ఇక జీవితాంతం ఆయనే అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నారు. దేశాధ్యక్షుడి పదవీకాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 78 శాతం రష్యన్లు ఓటేశారు. పుతిన్ ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రష్యాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు.

1999లో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన పుతిన్ ఆ ఏడాది చివరినాటికి దేశానికి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. 2000 మార్చి ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్షుడు కావడంతోనే వేర్పాటువాద గ్రూపులపై విరుచుకుపడి ప్రజల మన్ననలు అందుకుని తిరుగులేని నాయకుడయ్యారు. దీంతో 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా జీవితాంతం అధ్యక్షపీఠంపై కూర్చునేలా రాజ్యాంగాన్ని సవరించారు.
Vladimir Putin
Russia
President

More Telugu News