Lata Mangeshkar: కరోనా ఎవరినీ వదిలిపెట్టదు.. అందుకే అమితాబ్ కు సోకి ఉంటుంది: లతా మంగేష్కర్

Lata Mangeshkar responds on Amitab Bachchan who got infected by corona
  • అమితాబ్ కు ఇమ్యూనిటీ తక్కువగా ఉండొచ్చన్న లత
  • తప్పకుండా కోలుకుంటారని ధీమా
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచన
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారినపడి ఆసుపత్రి పాలవడంపై గానకోకిల లతా మంగేష్కర్ స్పందించారు. కరోనా ఎవరినీ వదిలిపెట్టదని, అమితాబ్ కు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నందున ఆయన వైరస్ కు గురై ఉంటారని అభిప్రాయపడ్డారు. అమితాబ్ తప్పకుండా కోలుకుంటారని అన్నారు. కరోనా మనతో పాటే మనుగడ సాగిస్తుందన్న అంశాన్ని అందరూ గమనించాలని పేర్కొన్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లతా మంగేష్కర్ సూచించారు.
Lata Mangeshkar
Amitabh Bachchan
Corona Virus
Bollywood
India

More Telugu News