Dil Raju: భార్యతో కలిసి దిల్ రాజు ఫొటో షూట్

Dil Raju photo shoot with his wife
  • ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు
  • ఫిట్ నెస్ పై దృష్టి సారించిన టాప్ ప్రొడ్యూసర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజు దంపతుల ఫొటో
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తేజశ్విని అనే యువతిని ఆయన పెళ్లాడారు. మే 10న నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వర దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత వీరిద్దరూ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత దిల్ రాజు ఫిట్ నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. తాజాగా తన భార్యతో కలసి ఆయన ఫొటో షూట్ చేయించుకున్నాడు. ఈ ఫొటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Dil Raju
Photo Shoot
Wife

More Telugu News