Lok Sabha: 'ఒక మెట్టు ఎక్కాను'.. లోక్‌సభలో తన సీటు మార్పుపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

raghurama krishnam raju ong changing seat in loksabha
  • లోక్‌సభలో నా స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఉండదు
  • మా పార్టీలో నన్ను వెలివేశారు
  • అయినా జగన్‌కు, పార్టీకి విధేయుడినే
  • జేపీ నడ్డాతో పలు అంశాలపై చర్చించాను
లోక్‌సభలో తన స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని  వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణ రాజు  చెప్పారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని తెలిపారు. తమ పార్టీలో తనను వెలివేశారని ఆయన చెప్పారు. అయినప్పటికీ తాను ఎన్నడూ సీఎం జగన్‌కు, తన పార్టీకి విధేయుడినేనని అన్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో తాను పలు అంశాలపై చర్చించానని, అయితే, అవి ఏంటో ఇప్పుడు చెప్పలేనని రఘురామకృష్ణ రాజు  అన్నారు. రాష్ట్ర రాజకీయాలపైనా జేపీ నడ్డాతో చర్చించానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి తనకు తెలియదని, తనకు మాత్రం ఏపీలో భద్రతలేదని వ్యాఖ్యానించారు.

కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ వల్ల తాను మూడు నెలల పాటు హైదరాబాద్‌లో ఉన్నానని, అయినప్పటికీ తనపై కొందరు కేసులు పెట్టారని ఆయన వాపోయారు. 
Lok Sabha
raghuramakrishnaraju
YSRCP

More Telugu News