Squirall: మంచి నీరు కావాలని ప్రాధేయపడిన ఉడుత... తెగ వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

Thirsty Squiral Wants Water Viral Video
  • యువకుడి ముందు నీరు కావాలంటూ తిరిగిన ఉడుత
  • నీరు తాగించగానే వెళ్లిపోయిన ఉడుత
  • హృదయాలను తాకుతున్న వీడియో
కాసేపు దాహం వేస్తేనే, నాలుక పిడచకట్టుకుపోతుంది. ఆపై నీరు తాగేందుకు ఎంతో ప్రయత్నిస్తాం. సమీపంలో నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనకు తెలుసు. మనుషుల వరకైతే ఓకే... అదే జంతువులైతే... అది కూడా ఓ ఉడుత అయితే? దానికి నీరు కావాలంటే ఎక్కడికి వెళుతుంది? ఎవరిని ప్రాధేయపడుతుంది?

ఈ వీడియో చూస్తే మాత్రం, అది మనకు తెలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో, దప్పికగొన్న ఓ ఉడుత, తనకు మంచి నీరు కావాలంటూ, వెనుక కాళ్లపై లేచి, వాటర్ బాటిల్ పట్టుకుని వున్న ఓ యువకుడిని చేతులతో సైగలు చేస్తూ అడిగింది.

తనకు నీళ్లివ్వాలని తనదైన శైలిలో సైగలు చేస్తూ, అతని చుట్టూ తిరిగింది. ఉడుత భాషను అర్థం చేసుకున్న యువకుడు, తన చేతిలోని వాటర్ బాటిల్ లోని నీటిని దానికి తాగించగా, దప్పిక తీర్చుకున్న ఉడుత, అక్కడి నుంచి వెళ్లిపోయింది. హృదయాలను తాకుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు. 
Squirall
Water
Viral Videos

More Telugu News