లాక్డౌన్తో హైదరాబాద్లో గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం
- పెద్దమొత్తంలో తగ్గిన గాలిలో సూక్ష్మధూళి కణాలు
- 630 అకాల మరణాలను అడ్డుకున్న వైనం
- రూ. 5,173 కోట్ల వైద్య ఖర్చులు ఆదా
కాలుష్యంతో రోగాల బారినపడే ప్రజలు వైద్యానికి ఖర్చు చేసే దాదాపు రూ.5,173 కోట్లు ఆదా అయినట్టు అధ్యయనం వివరించింది. మార్చి 25 నుంచి మే 11 మధ్య కాలంలో నమోదైన వాయు కాలుష్య గణాంకాలను ఐదేళ్ల వ్యవధిలో నమోదైన గణాంకాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. సూక్ష్మ ధూళి కణాలు ముంబైలో 10 శాతం, ఢిల్లీలో 54 శాతం తగ్గినట్టు గుర్తించారు. అలాగే, హైదరాబాద్, చెన్నై, కోల్కతా వంటి నగరాలలో 24 నుంచి 32 శాతం తగ్గినట్టు తేలింది.