Amitabh Bachchan: ఇక్కడ నిబంధ‌న‌లు చాలా క‌ఠినంగా ఉన్నాయి: కరోనా వార్డు నుంచి అమితాబ్ ట్వీట్

Amitabh Bachchan tweets from hospital
  • చాలా మంది మెసేజ్‌లు పంపిస్తున్నారు
  • సామాజిక మాధ్యమాల్లో చేసిన సందేశాలనూ చూశాను
  • అన్నింటికీ రిప్లై ఇవ్వలేను
  • ఇంత కంటే ఏమీ చెప్ప‌లేను
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడి మహారాష్ట్రలోని నానావతి ఆసుపత్రిలోని కరోనా వార్డులో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ ఆసుపత్రి నుంచి ఆయన తన అభిమానులకు ట్వీట్లు చేస్తున్నారు. తాను కొవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో తనకు చాలా మంది మెసేజ్‌లు పంపిస్తున్నారని ఆయన తాజాగా ట్విట్టర్‌లో తెలిపారు.
 
కరోనా బారిన పడ్డ తమ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థ‌న‌లు చేసిన వారికి అమితాబ్ బచ్చన్‌ థ్యాంక్స్ చెప్పారు. ఎస్‌ఎమ్‌ఎస్‌, వాట్సప్‌, ఇన్‌స్టా బ్లాగ్‌తో పాటు అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్ర‌తి ఒక్క‌రు తమ ఆరోగ్యం కోసం చేసిన మెసేజ్‌లు, ప్రార్థ‌న‌ల‌న్నింటినీ తాను చూశానని చెప్పారు. అయితే, ఆసుపత్రిలో‌ నిబంధ‌న‌లు చాలా క‌ఠినంగా ఉన్నాయని, అన్నింటికీ రిప్లై ఇవ్వలేనని, ఇవి అ‌వ్నీ తన ఆరోగ్యం కోస‌మేనని తెలిపారు. కాబ‌ట్టి తాను ఇంత కంటే ఏమీ చెప్ప‌లేనని అన్నారు.

Amitabh Bachchan
Bollywood
Corona Virus

More Telugu News