Telangana: తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ! 

New revenue division Vemulavada formed in Telangana
  • వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
  • కొత్త డివిజన్ లో ఆరు మండలాలు
  • 72కు చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది.

వేములవాడ, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనారావుపేట, చందుర్తి, బోయిన్ పల్లి మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తాజాగా వేములవాడ రెవెన్యూ డివిజన్ తో వీటి సంఖ్య 72కి చేరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana
Revenue Division
Vemulavada

More Telugu News