Varavara Rao: విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్

Varavara Rao tested corona positive
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు
  • ముంబయి తలోజా జైలు నుంచి జేజే ఆసుపత్రికి తరలింపు
  • కరోనా నేపథ్యంలో సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం
ఓ కుట్ర కేసులో నిందితుడిగా ముంబయి తలోజా జైల్లో ఉన్న విరసం నేత వరవరరావు అనారోగ్యంతో బాధపడుతుండగా, అనేక విజ్ఞప్తుల అనంతరం ఆయనను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించింది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ముంబయి జేజే ఆసుపత్రిలో ఉండగా, కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయనను సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించనున్నారు.

ఇటీవల కొంతకాలంగా వరవరరావు వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆయనను విడుదల చేయొద్దంటూ ఎన్ఐఏ గట్టి పట్టుదలతో ఉంది. చివరికి పౌరసమాజం నుంచి కూడా ఒత్తిళ్లు వస్తుండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Varavara Rao
Corona Virus
Positive
JJ Hospital
Mumbai

More Telugu News