Nara Lokesh: వైసీపీ అరాచకాలను బయటపెట్టిన న్యాయమూర్తిపై దాడి చేయడం దారుణం: నారా లోకేశ్

Lokesh reacts over attack on a magistrate in Chittoor district
  • చిత్తూరు జిల్లాలో జడ్జిపై దాడి
  • తీవ్రంగా ఖండించిన లోకేశ్
  • దళితులపై జగన్ రెడ్డి కక్షగట్టాడంటూ వ్యాఖ్యలు
రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో దళిత న్యాయమూర్తి రామకృష్ణపై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.  అధికార పక్ష నేతల అరాచకాలను బయటపెడుతున్నందుకే న్యాయమూర్తి రామకృష్ణపై భౌతికదాడికి దిగారని, ప్రభుత్వ అక్రమాలను బట్టబయలు చేస్తున్నందుకు జగన్ రెడ్డి దళితులపై కక్ష కట్టారని ఆరోపించారు.
Nara Lokesh
Ramakrishna
Magistrate
Chittoor District
YSRCP
Andhra Pradesh

More Telugu News