High Court: గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలని హైకోర్టు ఆదేశాలు

High Court orders government to conduct corona tests in Gandhi Hospital
  • 'గాంధీ'లో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం
  • ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టీకరణ
  • యశోద, కిమ్స్ లపై ఏం చర్యలు తీసుకున్నారన్న న్యాయస్థానం

తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుతెన్నులపై హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది.

కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు ల్యాబ్ ల్లో అన్నిరకాల పరీక్షలకు గరిష్ఠ చార్జీలు ఖరారు చేయాలని సూచించింది. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేస్తారా? లేదా? అనే అంశంలో ఈ నెల 27 లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News