Chandrababu: రెండు నెలల్లో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగాయి: చంద్రబాబు

Chandrababu says three incidents happened in two months
  • విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై చంద్రబాబు స్పందన
  • బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శలు
  • కంపెనీలకే వత్తాసు పలుకుతోందంటూ వైసీపీ సర్కారుపై వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ విశాఖపట్నంలో ఓ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై స్పందిస్తూ, రెండు నెలల వ్యవధిలో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగాయని అన్నారు. అయితే, ప్రభుత్వం బాధితులను ఆదుకోకుండా, ఆయా కంపెనీలకే వత్తాసు పలుకుతోందంటూ విమర్శించారు. ప్రభుత్వం ఈ ప్రమాదాలపై నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. తమ వైఫల్యాలపై టీడీపీ మీద నిందలు వేయడం వైసీపీ నేతలకు దురలవాటుగా మారిందని అన్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా చికిత్సపై మంత్రులకే నమ్మకం లేదని, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణ కన్నా కక్ష సాధించడంపైనే వైసీపీ ఎక్కువగా దృష్టి నిలిపిందని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలి, తప్పుడు కేసులతో విపక్ష నేతలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.
Chandrababu
Farma
Fire Accident
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News