Rekha: రేఖ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసిన అధికారులు!

Actress Rekha in home quarantine
  • రేఖ గార్డుతో పాటు, పనివాళ్లకు కరోనా పాజిటివ్
  • బంగ్లాకు సీల్ వేసి, కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన అధికారులు
  • ముంబై, బాంద్రా ప్రాంతంలో 'సీ స్ప్రింగ్స్' పేరిట రేఖ బంగ్లా  
అలనాటి అందాల నటి రేఖ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తన సెక్యూరిటీ గార్డుతో పాటు, ఇద్దరు పనివాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆమె బంగ్లాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. అంతే కాకుండా బంగ్లా వెలుపల కంటైన్మెంట్ ఏరియా అనే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు, రేఖ చేతిపై కరోనా క్వారంటైన్ స్టాంప్ వేశారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రేఖకు చెందిన అత్యంత ఖరీదైన 'సీ స్ప్రింగ్స్' బంగ్లా ఉంది.

మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... వారంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అమితాబ్ నివాసం 'జల్సా'కు కూడా అధికారులు సీల్ వేసి, కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు.
Rekha
Bollywood
Tollywood
Corona Virus
Home quarantine

More Telugu News