India: దేశంలో ఒక్కరోజులో 28,701 మందికి కరోనా

28701 new COVID19 cases  500 deaths reported in India
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 8,78,254
  • మృతుల సంఖ్య మొత్తం 23,174
  • 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 5,53,471 మంది  
భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.
 
                                                               
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,18,06,256 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,19,103 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
India
Corona Virus
COVID-19

More Telugu News