Harish Shankar: అత్యవసరంగా అంబులెన్స్ పంపాలంటూ యశోదా ఆసుపత్రిని కోరిన దర్శకుడు హరీశ్ శంకర్

Harish Shankar requests ambulance for an old age person
  • 70 ఏళ్ల వృద్ధుడికి శ్వాస ఇబ్బందులు
  • ఎంతోమందిని సాయం అడిగానన్న హరీశ్ శంకర్
  • సలహాలు ఇవ్వకుండా వెంటనే సాయం చేయాలని విజ్ఞప్తి
దర్శకుడు హరీశ్ శంకర్  ఓ వృద్ధుడి పరిస్థితి పట్ల చలించిపోయారు. 70 ఏళ్ల ఆ వృద్ధుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని, అత్యవసరంగా అంబులెన్స్ పంపించాలంటూ మలక్ పేట యశోదా ఆసుపత్రి వర్గాలను అర్థించారు. తాను అనేకమందిని కోరినా ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రావడంలేదని హరీశ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సాయం చేయదలచుకుంటే ఫోన్ నెంబరు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఈ క్లిష్ట సమయంలో సలహాలు ఇవ్వకుండా, చేతనైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Harish Shankar
Ambulance
Old Man
Breathing Problem
Yashoda Hospital
Malakpet
Hyderabad

More Telugu News