Lions: సింహాలు కూడా ఈదుతాయి... గిర్ అడవుల్లో రికార్డు చేసిన వీడియో ఇదిగో!

Lions swims in a reservoir at Gir Forest
  • సింహాలకు ఈదడం రాదని ప్రజల్లో భావన
  • గిర్ అడవుల్లోని రిజర్వాయర్ లో చలాకీగా ఈదిన సింహాలు
  • వీడియోలో రికార్డు చేసిన ఫారెస్ట్ గార్డు
అడవికి రారాజుగా చెప్పుకునే సింహానికి నీటిలో ఈదడం రాదని ఇప్పటివరకు భావించేవారు. అయితే ఇప్పుడీ వీడియో చూస్తే సింహాలు భేషుగ్గా ఈదుతాయని ఎవరైనా నమ్మేయాల్సిందే. గిర్ అడవుల్లోని ఓ రిజర్వాయర్ లో మూడు సింహాలు ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరడాన్ని ఓ ఫారెస్ట్ గార్డు వీడియోలో రికార్డు చేశారు. ఆ మూడు సింహాలు పక్కపక్కనే ఈదుతూ ఒడ్డుకి చేరిన పిమ్మట మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనేకమంది వన్యప్రాణి నిపుణులు సింహాలు ఈదడం చూసి ఆశ్యర్యపోతున్నారు.

Lions
Swimming
Reservoir
Gir Forest

More Telugu News