వికాస్ దూబే నమ్మినబంటును ముంబయిలో పట్టుకున్న పోలీసులు
- పోలీసులను చంపిన తర్వాత పారిపోయిన గుడ్డాన్
- ముంబయిలో తిరుగుతుండగా అరెస్ట్
- వికాస్ దూబేతో కలిసి అనేక నేరాలకు పాల్పడిన గుడ్డాన్
తాజాగా సురక్షితమైన స్థావరం కోసం అన్వేషిస్తుండగా, ముంబయి ఏటీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. గుడ్డాన్ డ్రైవర్ సోను తివారీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దూబేతో కలిసి గుడ్డాన్ అనేక నేరాల్లో పాలుపంచుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. 2001లో రాష్ట్ర మంతి సంతోష్ శుక్లా హత్యకేసులోనూ వికాస్ దూబేతో కలిసి గుడ్డాన్ నిందితుడని గుర్తించారు. గుడ్డాన్ అరెస్ట్ పై ముంబయి ఏటీఎస్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, గుడ్డాన్ త్రివేది.. తన బాస్ వికాస్ దూబేతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో గుడ్డాన్... సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.