KTR: లాక్ డౌన్ వల్ల తొమ్మిది నెలల్లో పూర్తి కావాల్సిన పనులు రెండు నెలల్లోనే పూర్తయ్యాయి: కేటీఆర్

KTR and Kishan Reddy inaugurates two flyovers in Hyderabad
  • రెండు వంతెనలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్
  • రూ. 5 వేల కోట్లతో స్కైవేలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
  • పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తామన్న మంత్రి
హైదరాబాదులో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయాన్ని అధికారులు పూర్తిగా వినియోగించుకున్నారు. రోడ్లు ఖాళీగా ఉండటంతో పనులను పరుగులు పెట్టించారు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్సార్డీపీలో భాగంగా రెండు వంతెనలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. తొలి దశలో రూ. 350 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్ ప్రాజెక్ట్... రెండో దశలో రూ. 76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు మూడు లేన్ల వంతెనను నిర్మిస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. రూ. 5 వేల కోట్లతో స్కైవేలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా తొమ్మిది నెలల్లో పూర్తి కావాల్సిన పనులు కేవలం రెండు నెలల్లో పూర్తయ్యాయని తెలిపారు.
KTR
TRS
Kishan Reddy
BJP

More Telugu News