Alla Nani: మంత్రి ఆళ్ల నానికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువ

Corona patients complains to AP Health Minister Alla Nani
  • ఏలూరు కలెక్టరేట్ నుంచి మంత్రి సమీక్ష
  • నాణ్యతలేని భోజనం అందిస్తున్నారన్న రోగులు
  • బాత్రూంలు శుభ్రం చేయడం లేదని ఫిర్యాదు
  • సమస్యలపై తన ఫోన్ నెంబర్ కు కాల్ చేయొచ్చన్న మంత్రి
ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఏలూరులోని కలెక్టరేట్ నుంచి కరోనా సమీక్ష నిర్వహించారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై మాట్లాడారు. ఏలూరు ఆశ్రమ్, భీమవరం, తాడేపల్లిగూడెం కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ సమీక్షలో మంత్రికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి.

చికిత్సా కేంద్రాల్లో పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, బాత్రూంలు సరిగా శుభ్రం చేయడంలేదని, దుప్పట్లు ఇవ్వడంలేదని, ముఖ్యంగా భోజనం నాసిరకంగా ఉందంటూ అత్యధికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్సా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని, లేకపోతే తన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి సమస్యలు నివేదించవచ్చని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
Alla Nani
Corona Patients
Complaints
Review
Andhra Pradesh

More Telugu News