Bandi Sanjay: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్... థ్యాంక్స్ చెప్పిన బండి సంజయ్

Bandi Sanjay thanked CM KCR
  • నేడు బండి సంజయ్ పుట్టినరోజు
  • నిండు నూరేళ్లు జీవించాలని దీవించిన కేసీఆర్
  • మీ సహృదయతకు ధన్యవాదాలు అంటూ సంజయ్ ట్వీట్
ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బండి సంజయ్ కి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి, ప్రజలకు సేవలు అందించాలని దీవించారు. ఈ మేరకు ప్రత్యేక సందేశం పంపారు. దీనిపై బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్సులు అంటూ స్పందించారు. మీ సహృదయతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ స్పందించారు. పుట్టినరోజు సందర్భంగా అందించిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Bandi Sanjay
KCR
Birth Day
Wishes
BJP
Telangana

More Telugu News