Hyderabad: తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. నిన్న 1,278 కేసుల నమోదు!

1278  corona cases in Telangana yesterday
  • జీహెచ్ఎంసీ పరిధిలో కొంత తగ్గుదల
  • నిన్న 8 మంది మృత్యువాత
  • 400కు చేరువైన మరణాల సంఖ్య
తెలంగాణలో కరోనా కేసులు వేలల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,278 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి మరో 8 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక కొత్త కేసుల్లో 762 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూశాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్ లో 85, సంగారెడ్డిలో 36, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 23, వరంగల్ అర్బన్‌లో 5, వరంగల్ రూరల్‌లో 8, కరీంనగర్‌లో 9, మహబూబాబాద్, పెద్దపల్లిలో ఆరేసి కేసులు, మెదక్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 14, మంచిర్యాలలో 17, నల్గొండలో 32, రాజన్న సిరిసిల్లలో 7, ఆదిలాబాద్‌లో 14, నారాయణపేటలో 9, జనగామలో 3, నిజామాబాద్‌లో 8, సిద్ధిపేటలో 4, సూర్యాపేటలో 14, గద్వాల, ఆసిఫాబాద్, నిర్మల్‌, యాదాద్రి, వనపర్తిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 339 మంది మృతి చెందారు. నిన్న 1,013 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,205కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 12,680 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,51,109 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, వారిలో 1,18,885 మందికి నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
.
Hyderabad
GHMC
Telangana
Corona Virus

More Telugu News