Andhra Pradesh: ఏపీలో కరోనా అప్ డేట్స్ .. 24 గంటల్లో 1,555 కేసుల నమోదు

1555 new corona cases registered in AP in 24 hours
  • 24 గంటల్లో 13 మంది మృతి
  • 23,814కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య 
  • మొత్తం మరణాల సంఖ్య 277
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 1,555 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. వీరిలో ఏపీ నుంచి 1,500 కేసులు నమోదు కాగా... 53 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో, రెండు కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో నమోదయ్యాయి. 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో చిత్తూరు (236), గుంటూరు (228), విశాఖ (208), శ్రీకాకుళం (206) ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.  

మరోవైపు గత 24 గంటల్లో 13 మంది కరోనా కారణంగా చనిపోయారు. 904 మంది ఆసుపత్రుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుత కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,814కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 277కి చేరుకుంది.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Cases