Andhra Pradesh: ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి రేట్లను నిర్ధారించిన ఏపీ ప్రభుత్వం.. వివరాలు ఇవిగో!

AP govt fixes charges for corona patients treatment in private hospitals
  • క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250
  • వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తే రూ. 9,580
  • ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకు రూ. 5,980
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అనుమతిస్తున్నాయి. తాజాగా కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జారీ చేశారు.

ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇవే!
  • క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250
  • ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకు రూ. 5,980
  • క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకు రూ. 5,480
  • వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తే రూ. 9,580
  • ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రూ. 6,280
  • ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ. 10,380
ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులన్నీఇవే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh
Private Hospitals
Corona Virus
Treatment
Charges

More Telugu News