చిరంజీవి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారు... నాకు కరోనా సోకిన విషయం పవన్ కు తెలిసుండకపోవచ్చు: బండ్ల గణేశ్
- కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేశ్
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
- మారుతి ఫోన్ కాల్ సంతోషం కలిగించిందని వెల్లడి
అయితే ఆసుపత్రిలో చికిత్స పొంది త్వరగానే కోలుకున్నానని, తనకు మోహన్ బాబు, దర్శకుడు మారుతి, హీరో శ్రీకాంత్, రాజా రవీంద్ర, వీవీ వినాయక్, శ్రీను వైట్ల ఫోన్ చేసి పరామర్శించారని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారని, ఎన్నో జాగ్రత్తలు చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ, మీ దేవుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేయలేదా? అని ప్రశ్నించింది.
అందుకు బండ్ల గణేశ్ బదులిస్తూ, పవన్ ఫోన్ చేయలేదని తెలిపారు. బహుశా, తనకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలిసుండకపోవచ్చని అన్నారు. నాకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలియదేమోలే అని సరిపెట్టుకోవడమే మంచిదని అన్నారు. అయితే ఎంతోమంది ఫోన్ చేసినా దర్శకుడు మారుతి ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషానికి గురయ్యానని, ఆయనతో తాను ఎలాంటి చిత్రం చేయకపోయినా ఫోన్ చేసి పరామర్శించడం మనసును హత్తుకుందని వెల్లడించారు.