Nara Lokesh: పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు... ఇది జగన్ మార్కు రివర్స్ టెండర్: లోకేశ్

Nara Lokesh terms it Jagan mark reverse tender
  • పేదల గుడిసెలను కూల్చేస్తున్నారని ఆరోపించిన లోకేశ్
  • జగన్ అహంకారానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యలు
  • పేదల గుడిసెలు కూడా వేసుకోకూడదా అంటూ ట్వీట్
టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ హయాంలో భూములు ఇవ్వగా, పేదలు అందులో గుడిసెలు వేసుకున్నారని లోకేశ్ వివరించారు. ఇప్పుడా గుడిసెలను కూల్చివేయడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు అంటూ విమర్శించారు. పేదల భూములు లాక్కుని పేదలకే అమ్మడం జగన్ మార్కు రివర్స్ టెండర్ అంటూ ఎద్దేవా చేశారు. "మీకు ఉండడానికి విల్లాలు, రాజప్రాసాదాలు కావాలి. పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh
Jagan
Lands
Huts
Kurnool District
Telugudesam
YSRCP

More Telugu News