Supreme Court: తన కుమార్తె నకిలీ బాబా ఆశ్రమంలో చిక్కుకుందని సుప్రీంను ఆశ్రయించిన హైదరాబాద్ వాసి

 Hyderabad resident approaches Supreme Court over fake babas
  • అక్రమ ఆశ్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్
  • సొలిసిటర్ జనరల్ కు సుప్రీం ఆదేశాలు
  • రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ
హైదరాబాద్ కు చెందిన దుంపాల రాంరెడ్డి అనే వ్యక్తి అక్రమ ఆశ్రమాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తన కుమార్తె ఢిల్లీకి చెందిన ఓ నకిలీ బాబా ఆశ్రమంలో చిక్కుకుపోయిందని పేర్కొన్నారు. నకిలీ బాబాల ఆశ్రమాలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం అక్రమ ఆశ్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Supreme Court
Petition
Fake Baba
Soliciter General

More Telugu News