Saurav Ganguly: ఔను... ధోనీని ఎంపిక చేయాలని అప్పుడు నేనే చెప్పాను: గంగూలీ

I suggested selectors to select Dhoni says Ganguly
  • ధోనీని ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సూచించాను
  • మంచి జట్టును ఎంచుకోవడం కెప్టెన్ పని
  • ధోనీకి నేను పెద్ద అభిమానిని
పుట్టినరోజు సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ ఒక గొప్ప ప్లేయర్ అని కొనియాడారు. 2004లో బంగ్లాదేశ్ సిరీస్ కోసం జట్టులోకి ధోనీని ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్టర్లకు తానే చెప్పానని ఆయన అన్నారు. ఉత్తమమైన జట్టును ఎంచుకోవడం కెప్టెన్ పని అని చెప్పారు. ధోనీ వంటి ఆటగాడు తనకు లభించినందుకు తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. ధోనీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఈరోజు ధోనీ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కూడా గంగూలీ చేసిన వ్యాఖ్యలనే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.
Saurav Ganguly
MS Dhoni
Team India

More Telugu News