Corona Virus: ఏపీలో కరోనా స్వైరవిహారం... గుంటూరు జిల్లాలో కొత్తగా 238 కేసులు

Corona virus spreads massively in Guntur district
  • గత 24 గంటల్లో ఏపీలో 1178 కేసులు
  • 13 మంది మృతి
  • 762 మంది డిశ్చార్జి
ఏపీలోని అన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 238 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100 కేసులు గుర్తించారు.

అన్ని జిల్లాల్లో కలిపి 1178 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కి చేరింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో 13 మంది కరోనాతో మృత్యువాత పడగా, రాష్ట్రంలో మరణాల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా 762 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 11,200 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Guntur District
Andhra Pradesh
Positive
COVID-19

More Telugu News