చైనా, పాక్ నిర్మాణాలపై పీవోకేలో నిరసన ప్రదర్శనలు
- ముజఫరాబాద్ వాసుల ఆందోళన
- నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణం వద్దని వాదన
- పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని నిరసన
- ప్రాజెక్టులు ఆపే వరకు నిరసనలను కొనసాగిస్తామని హెచ్చరిక
ఆయా నదులపై నిర్మాణాల కోసం చైనా, పాకిస్థాన్ ఏ చట్టం కింద ఒప్పందం చేసుకున్నాయని వారు నిలదీస్తున్నారు. ఇరు దేశాలు ఆ ప్రాంతాల్లో అక్రమంగా కోహ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపకపోతే వాటిని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
ఆయా ప్రాజెక్టులు ఆపే వరకు తమ నిరసనలను కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జీలం నదిపై హైడ్రో పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఈ 1,128 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ కోసం 92.9 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు.