Karnataka: పరిస్థితులు ఇక మా చేతుల్లో లేవు.. కోవిడ్‌పై కర్ణాటక మంత్రి ఆందోళనకర వ్యాఖ్యలు

 COVID Spreading At Community Level says Karnataka Minister
  • వారు బతికి బట్టకడతారన్న నమ్మకం లేదు
  • రాష్ట్రంలో వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైంది
  • ఖండించిన ముఖ్యమంత్రి యడియూరప్ప
కర్ణాటక మంత్రి మధుస్వామి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తుమూకూరు కోవిడ్ ఆసుపత్రిలో చేరిన 8 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారు బతికి బట్టకడతారన్న నమ్మకం లేదన్న మంత్రి.. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని పేర్కొన్నారు. వైరస్‌ను కట్టడి చేయడం అధికారులకు కష్టమవుతోందని, పరిస్థితులు ఇక తమ చేతుల్లో లేవని పేర్కొన్నారు.

అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం అందుకు పూర్తి విరుద్ధ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ కూడా మంత్రి మధుస్వామి వ్యాఖ్యలను ఖండించారు.
Karnataka
Minister Madhuswamy
Corona Virus
BS Yediyurappa

More Telugu News