Vijayawada Gang war: విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పురోగతి.. మరో ఆరుగురి అరెస్ట్

Police arrest another 6 persons in vijayawada gang war case
  • విజయవాడలో సంచలనం సృష్టించిన సందీప్ హత్య
  • ఈ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు
  • ఐదు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
విజయవాడలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ కేసులో పటమట పోలీసులు నిన్న మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తోట సందీప్ హత్య కేసులో జూన్ 5న 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, కొండూరు మణికంఠ అలియాస్ పండుపై హత్యాయత్నం కేసులో జూన్ 8న 11 మందిని, అదే నెల 10న మరో 9 మందిని, 13న ప్రధాన నిందితుడు పండును అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ గొడవకు కారణమైన మరో ముగ్గురు నిందితులను జూన్ 14న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

తాజాగా, మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పటమట తోటవారి వీధికి చెందిన పురం చైతన్య అలియాస్‌ బుడ్డి (26), కానూరు వసంత్‌నగర్‌కు చెందిన మాచర్ల సాగర్‌ (24), పటమట డొంక రోడ్డుకు చెందిన పులగం జూసి ప్రభుకాంత్‌ (29), యనమలకుదురు ఇందిరానగర్‌-1కు చెందిన కందుల అనిల్‌ కుమార్‌ (27), పటమట పోస్టల్‌ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి ఆదిశేషు (21), పటమట రెల్లీస్‌ కాలనీకి చెందిన ముత్యాల కుమారస్వామి అలియాస్‌ చంబు (19) ఉన్నారు.
Vijayawada Gang war
thota sandeep
Pandu
Crime News

More Telugu News