Sengamalam: సూపర్ హెయిర్ స్టయిల్ తో సెలబ్రిటీగా మారిన ఏనుగు

 Elephant grabs attention with a unique hair style
  • మన్నార్ గుడి ఆలయంలో ఏనుగుకు ప్రత్యేక హెయిర్ స్టయిల్
  • బాబ్డ్ కట్ 'సెంగమాలమ్' గా ఫేమస్ అయిన గజరాజు
  • ఇంటర్నెట్లోనూ దీనికి ఫ్యాన్స్
తమిళనాడు రాష్ట్రం హైందవ దేవాలయాలకు పెట్టిందిపేరు. అక్కడున్న చాలా ఆలయాల్లో ఆస్థాన కైంకర్యాల నిమిత్తం ఏనుగులను పోషిస్తుంటారు. అయితే, అన్ని ఏనుగులు ఒకెత్తయితే మన్నార్ గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న 'సెంగమాలమ్' అనే ఏనుగు మరో ఎత్తు. ఏమిటి దీని ప్రత్యేకత అంటారా..? ఇతర ఏనుగులకు భిన్నంగా 'సెంగమాలమ్' చక్కని హెయిర్ స్టయిల్ తో దర్శనమిస్తుంది. అది కూడా బాబ్డ్ కట్ మరి! తన ముఖానికి సరిపోయే క్రాఫింగుతో ఆ ఏనుగు అందం చూడాల్సిందే.

దీనికి ఇంటర్నెట్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 'సెంగమాలమ్' ఫొటో పోస్టు చేస్తే చాలు... లైకులు పోటెత్తుతాయి. బాబ్డ్ కట్ 'సెంగమాలమ్' అంటే సామాజిక మాధ్యమాల్లో మాంచి క్రేజ్ ఏర్పడింది. 'సెంగమాలమ్' స్వస్థలం కేరళ. అయితే 2003లో దాన్ని మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు. ముఖంపై తిరునామాలు, ఆపైన అందమైన హెయిర్ స్టయిల్... 'సెంగమాలమ్' ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి.

Sengamalam
Elephant
Hairstyle
Mannargudi
Tamilnadu

More Telugu News