New Delhi: కూతురి ఫ్రెండేకదా అని ఇంట్లోకి రానిస్తే... రూ. 57 లక్షలు నొక్కేసింది!

Lady Steels 57 Lakhs from Friend House
  • సెంట్రల్ న్యూఢిల్లీలో ఘటన
  • రెండు దఫాల్లో రూ. 57 లక్షల దొంగతనం
  • ఫ్లాట్, బంగారం, డబ్బును రికవర్ చేసిన పోలీసులు
తన బిడ్డ స్నేహితురాలే కదా అని ఇంట్లోకి రానిచ్చిన ఓ మహిళ నుంచి పూజా అనే యువతి రూ. 57 లక్షలు కాజేసింది. ఇప్పుడు పోలీసులకు దొరికి పోయి ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. సెంట్రల్ ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, పుష్ప అనే మహిళ, తన ఇంట్లో దొంగతనం జరిగిందని, ఓ ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకుంటే పోయిందని, తన కుమార్తె స్నేహితురాలైన పూజ అనే యువతిపైనే అనుమానంగా ఉందని చెప్పడంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేసి రంగంలోకి దిగారు.

పూజను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. పుష్ప ఇంట్లో పెద్దమొత్తంలో డబ్బుందని తెలుసుకున్న ఆమె, ఓ దఫా రూ. 27 లక్షలు కాజేసి తన తమ్ముళ్లు వరుణ్, అమిత్ లకు ఇచ్చి, వారితో ఫ్లాట్ కొనిపించింది. మరోసారి ఆమె ఇంటికి వెళ్లి, ఇంకో రూ. 30 లక్షలు కాజేసింది. పుష్ప ఫిర్యాదుతో విచారించిన పోలీసులు, పూజ నుంచి రూ. 29.43 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమె కొనుగోలు చేయించిన ఫ్లాట్ ను, దొంగిలించిన డబ్బుతో కొన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె సోదరులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
New Delhi
Theft
Daughter
Friend
Police

More Telugu News