Payal Rajput: అల్లు అర్జున్ 'పుష్ప'పై క్లారిటీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

Payal Rajput refutes rumors that she signed fo Pushpa and Indian two
  • పుష్పలో పాయల్ ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్టు ప్రచారం
  • ఇండియన్-2లోనూ మసాలా పాటకు నర్తిస్తోందంటూ వార్తలు
  • అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసిన పాయల్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగు చేయడానికి అందాల భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పాయల్ రాజ్ పుత్ స్పందించింది. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడంలేదని వాపోయింది.

'పుష్ప' చిత్రంలో తాను ఎలాంటి పాటలో నటించడంలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తననెవరూ సంప్రదించలేదని వెల్లడించింది. 'పుష్ప' చిత్రంతో పాటు 'ఇండియన్-2' చిత్రంలో మీరు ఐటెమ్ సాంగులు చేస్తున్నారట కదా అంటూ గత కొన్నిరోజులుగా తనకు ఎన్ని సందేశాలు వచ్చాయో దేవుడికే తెలుసని పేర్కొంది. ఇవన్నీ రూమర్లేనని, ప్రస్తుతం తాను ఏ సినిమా చిత్రీకరణలో పాల్గొనడంలేదని పాయల్ స్పష్టం చేసింది.
Payal Rajput
Pushpa
Indian-2
Item Song
Tollywood

More Telugu News