Donald Trump: 'అమెరికా లవ్స్ ఇండియా': డొనాల్డ్ ట్రంప్

Trump Says America Loves India
  • నిన్న యూఎస్ స్వాతంత్ర్య దినోత్సవం
  • శుభాకాంక్షలు తెలిపిన మోదీకి కృతజ్ఞతలు
  • ట్విట్టర్ లో అధ్యక్షుడు ట్రంప్
అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన శుభాభినందనలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. శనివారం నాడు నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమెరికా ప్రజలను విష్ చేసిన సంగతి తెలిసిందే. మోదీ ట్వీట్ ను చూసిన ట్రంప్, దానికి సమాధానం ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, "నా నేస్తమా కృతజ్ఞతలు. అమెరికా లవ్స్ ఇండియా" అని ఆయన అన్నారు. నిన్న అధ్యక్షుడు ట్రంప్, దక్షిణ డకోటా ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి వేడుకలకు హాజరైన వారిని నవ్వుతూ పలకరించారు. 
Donald Trump
Narendra Modi
Twitter
Independence Day

More Telugu News