Rashmika Mandanna: తదుపరి చిత్రానికి రష్మికను రికమెండ్ చేసిన చైతూ!

Chaitanya suggests Rashmikas name
  • చైతూతో 'మనం' ఫేం విక్రంకుమార్ మూవీ 
  • నిన్నటి వరకు సమంత, కీర్తిసురేశ్ పేర్లు
  • రష్మిక పలు చిత్రాలతో ఇప్పటికే బిజీ  
అక్కినేని నాగ చైతన్య హీరోగా 'మనం' ఫేం విక్రంకుమార్ ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే. కథ బాగా నచ్చడంతో చైతన్య కూడా ఈ ప్రాజక్టుకి వెంటనే ఓకే చెప్పేశాడు. ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుందంటూ మొదట్లో వార్తలొచ్చాయి. నిజజీవిత జంట మరోసారి వెండితెరపై కనువిందు చేస్తుందని అభిమానులు కూడా సంబరపడ్డారు. అయితే, ఆ తర్వాత కీర్తి సురేశ్ పేరు కథానాయిక పాత్రకు వినిపించింది. ఇప్పుడు తాజాగా రష్మిక మందన్న పేరు తెరపైకి వచ్చింది.

చిత్ర నిర్మాత కీర్తి సురేశ్ పట్ల ఆసక్తి చూపుతుండగా, హీరో చైతన్య మాత్రం రష్మికను తీసుకోమని సజస్ట్ చేస్తున్నాడట. ప్రస్తుతం రష్మిక మంచి ఫామ్ లో ఉండడంతో హీరోలు కూడా చాలామంది ఆమెనే కోరుకుంటున్నారు. అయితే, ఆమె ఇప్పటికే కొన్ని ప్రాజక్టులతో బిజీగా ఉండడంతో ఈ చిత్రానికి డేట్స్ ఇస్తుందా? అన్నది డౌటే!        
Rashmika Mandanna
Naga chaitanaya
Samantha

More Telugu News