Tollywood: కరోనాతో టాలీవుడ్‌ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత

producer pokuri passes away
  • ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు రామారావు
  • బాబూ రావు నిర్మించిన సినిమాలకు సమర్పకుడిగా రామారావు
  • నేటి భారతం, వందేమాతరం సినిమాలకు సమర్పకుడు
టాలీవుడ్ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్‌ సమర్పకుడు పోకూరి రామారావు(64) ఈ రోజు ఉద‌యం కరోనాతో క‌న్నుమూశారు. ఈయన ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావుకు సోదరుడు. బాబూరావు నిర్మించిన సినిమాలకు ఈయన సమర్పకుడిగా ఉండేవారు. నేటి భారతం, వందేమాతరం, ఎర్ర మందారం, దేశంలో దొంగలు పడ్డారు, యజ్ఞం, రణం వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

పోకూరి రామారావు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు కరోనా సోకడంతో గ‌త కొన్ని రోజులుగా హోం క్వారెంటైన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆయన కుటుంబ స‌భ్యులకు నిర్వహించిన కరోనా టెస్టులు నెగిటివ్‌గా తేలినట్లు సమాచారం.
Tollywood
Corona Virus

More Telugu News