Pawan Kalyan: జోష్ ఆకాశాన్ని అంటింది సర్: మోదీపై పవన్ వ్యాఖ్యలు

Pawan Kalyan praises PM Modi on Ladakh visit
  • మోదీ లడఖ్ పర్యటనపై పవన్ ప్రశంసల జల్లు
  • నాయకత్వం అంటే ప్రజల్లో స్ఫూర్తిని రగిలించడమేనన్న పవన్
  • ఇది అభివృద్ధి యుగం అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లో పర్యటించి సైనిక దళాలకు సర్ ప్రైజ్ ఇచ్చారు. సరిహద్దు ఉద్రిక్తతల్లో మునిగితేలుతున్న సైనికులకు ఆయన రాక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు.

"దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించడమే సిసలైన నాయకత్వం అనిపించుకుంటుంది. మన సాయుధ బలగాల తెగువకు ప్రధాని నరేంద్ర మోదీ నీరాజనాలు అర్పించారు. వారితో ముచ్చటించారు. మోదీ రాక మన బలగాల్లో కచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. మీ పర్యటనతో జోష్ ఆకాశాన్ని అంటింది సర్!" అంటూ పవన్ ట్వీట్ చేశారు.

"ఇది అభివృద్ధి యుగం. విస్తరణవాదం ఇప్పుడు పనిచేయదు. శాంతికి కట్టుబడి ఉండాలన్న భారత్ వైఖరి బలహీనత ఎంతమాత్రం కాదు. మన శాంతిని, అభివృద్ధిని చెదరగొట్టాలని చూసేవారికి మనం దీటైన సమాధానం ఇవ్వాలి" అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Narendra Modi
Ladakh
Army
India
China

More Telugu News