Raghuramkrishna Raju: అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి.. హైకోర్టును ఆశ్రయించిన రఘురామ కృష్ణరాజు

MP Raghurama krishna Raju petition in AP High Court
  • పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్న నరసాపురం ఎంపీ
  • తాను ఎన్నికయింది ఓ పార్టీపై.. షోకాజ్ నోటీసు ఇచ్చింది మరో పార్టీ లెటర్ హెడ్‌పై
  • ఈసీ నిర్ణయం తీసుకునే వరకు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ పిటిషన్
వైసీపీ అధిష్ఠానం తనపై అనర్హత వేటు వేసి సస్పెన్షన్ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామ కృష్ణరాజు కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Raghuramkrishna Raju
YSRCP
AP High Court

More Telugu News