Kathi Mahesh: తనకు కరోనా సోకిందంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పష్టతనిచ్చిన క‌త్తి మ‌హేశ్

kathi mahesh gives clarity
  • క‌రోనా టెస్ట్ చేయించుకున్నాను
  • నాకు నెగిటివ్ వచ్చింది
  • కొంద‌రు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు
  • ఇకనైనా శునకానందం మానుకోవాలి
సినీ నటుడు, క్రిటిక్‌ క‌త్తి మ‌హేశ్‌కు కరోనా సోకిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. తాజాగా ఆయన ఈ విషయంపై సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు.

తాను క‌రోనా టెస్ట్ చేయించుకున్నానని, నెగిటివ్ వచ్చిందని కత్తి మహేశ్ చెప్పాడు. కొంద‌రు ఉద్దేశపూర్వకంగానే  తనపై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని తెలిపాడు. తనకు కరోనా రావాలని కోరుకుంటున్నవారే ఇటువంటి వార్తలు సృష్టిస్తున్నారేమోనని వ్యాఖ్యానించాడు.  

ఇకనైనా శునకానందం మానుకోవాలని కత్తి మహేశ్ అన్నాడు. ఇటువంటి ప్రచారం చేయడం మానేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని హితవు పలికాడు. ఇటువంటి అసత్య ప్రచారం సరికాదని చెప్పాడు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఒకవేళ కరోనా సోకినా తాను అధైర్యపడబోనని తెలిపాడు. అసత్య వార్తల నేపథ్యంలో తనకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పాడు.
Kathi Mahesh
Tollywood
Corona Virus

More Telugu News