మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ... వచ్చేసిన జియో ఉచిత కాలింగ్ యాప్ 'జియో మీట్'
- జూమ్ తదితర యాప్ లపై పెరుగుతున్న వ్యతిరేకత
- ఇన్విటేషన్ కోడ్స్ అవసరం లేకుండా సరికొత్త యాప్
- అవకాశాన్ని అందిపుచ్చుకున్న రిలయన్స్ జియో
ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది.
లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచే పని చేసుకోవడానికి, అధికారులు, సిబ్బందితో కలిసుండటానికి, పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు చెప్పుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్ ను https://jiomeetpro.jio.com నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.