Brahmanandam: సినిమాలకు బ్రహ్మానందం గుడ్‌బై.. ఇక బుల్లితెరకు హాస్యబ్రహ్మ?

Tollywood comedian Brahmanandam ready to debut on Television
  • సినిమాలకు దూరంగా ఉండాలని బ్రహ్మీ నిర్ణయం
  • ఇప్పటికే పలు కథలు వినిపించిన బుల్లితెర దర్శకులు
  • త్వరలోనే టీవీ సీరియళ్లపై ప్రకటన?
తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపై బుల్లితెరపై కనిపించబోతున్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం సినిమాల్లో నటించడం బాగా తగ్గించేశారు. సినిమాల్లో ఇక నటించకూడదని నిర్ణయించుకున్న బ్రహ్మానందం టీవీ సీరియళ్ల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ డైలీ సీరియర్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బ్రహ్మానందం పాత్రకు ప్రత్యేకత ఉండేలా టీవీ దర్శకులు బ్రహ్మానందానికి ఇప్పటికే కొన్ని కథలు వినిపించారని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ విషయంలో ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. అయితే, త్వరలోనే ఆయన ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం. బ్రహ్మానందం టీవీ సీరియళ్లలో నటించారంటే ఇక ప్రతీ ఇల్లు నవ్వులతో నిండిపోక తప్పదని ఆయన అభిమానులు అంటున్నారు.
Brahmanandam
Tollywood
Telivision

More Telugu News