Village Volunteer: వృద్ధులు, వికలాంగుల పింఛన్ సొమ్ముతో పరారైన గ్రామ వాలంటీర్

Village Volunteer escapes with pension cash
  • అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లిలో ఘటన
  • రూ. 63 వేలతో పరారైన గ్రామ వాలంటీర్
  • స్విచ్చాఫ్ వస్తున్న ఫోన్
వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్మును తీసుకుని గ్రామ వాలంటీర్ పరారైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన పెనుకొండ మండలం కొండపల్లిలో జరిగింది. ఈ నెలకు సంబంధించి గ్రామంలో 49 మందికి పింఛన్ అందాల్సి ఉంది. గ్రామ సచివాలయం వెల్ఫేర్ అధికారి హీరా నుంచి పింఛన్ కు సంబంధించిన రూ. 63 వేల సొమ్మును వాలంటీర్ నాయక్ తీసుకున్నాడు.

ఒకటో తారీఖునే ఈ డబ్బు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. అయితే ఆ సొమ్ము అందకపోవడంతో... వారు ఆరా తీశారు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బుతో పాటు వాలంటీర్ పరారైనట్టు తెలిసింది. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో అతనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Village Volunteer
Anantapur District
Penukonda
Pension

More Telugu News