Mahesh Babu: ట్విట్టర్ లో మహేశ్ 'దూకుడు'.. దక్షిణాదిలో ఎవరికీ అందనంత ఎత్తులో సూపర్ స్టార్

10 Million followers for Mahesh Babu in Twitter
  • ట్విట్టర్ లో దూసుకుపోతున్న మహేశ్ బాబు
  • 10 మిలియన్ల ఫాలోయర్లను సాధించిన మహేశ్
  • రెండో స్థానంలో తమిళ హీరో ధనుష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇతర హీరోలతో పోలిస్తే... సోషల్ మీడియాలో మహేశ్ కొంచెం ఎక్కువగానే యాక్టివ్ గా ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయనను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మహేశ్ ఓ ఘనతను సాధించాడు. ట్విట్టర్ లో 10 మిలియన్ల (కోటి) ఫాలోయర్లను సాధించిన ఏకైన దక్షిణ సినీ స్టార్ గా అవతరించాడు. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు.

దక్షిణాది నుంచి తమిళ స్టార్ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో వేచి చూడాలి.
Mahesh Babu
Twitter
Tollywood

More Telugu News